Friday 29 March 2019

A dark Poem అనబడు Blowem

1
కుచ్ బీ నై హువా యారో...!
Just ఒక రోజు గడిచి"పోయిందంతే
రెండు వాడల్ని నరకటానికి సరిపోయిన సమయం కంటే ఎక్కువే
కారంచేడో, చుండూరో, గరగపర్రో, రాపురో
ఎదో ఒకటి జల్నేదో, చల్నే దో

2
మాలో మాదిగో మంగలో చాకలొ
Fuck them all మనకు మతం ముఖ్యం
కులం ముఖ్యం..
పెళ్లి సంగతి ప్యారెంట్స్ చూసుకుంటారు గానీ
చదువుకోండి ఫస్టు
చరిత్రలని.. చర్చిత్రలని, గుళ్ళలోని..గుల్లింపులని

3
మర్యాద మర్యాద... అమ్మలని అక్కలని
మతాలముందు పడుకోబెట్టి
బొమ్మలని, బొక్కలని "జగడపు చనువుల జాజరల్లో" పాడుకోబెట్టి
Nothing will happens man
It's ఆలిందగేమ్ ఆఫ్ యువర్ పురాపురాణాస్
గాయపడ్డ నెరేళ్ల నేరాన్ని స్మశానం వరకూ వాళ్ళు మోసుకుంటారు
చింతమనేని కోసం మరో రెండు పీకల్ని కోసుకుంటారు"పిచ్చిముండాకొడుకులు"

4
Red Red go away
Blue Blue blow the way
లాల్.. నీల్... నా బుల్లేకి బాల్ లెక్కలు తప్ప
ఇంకేం మిగల్లేదు మళ్లీ మనోన్ని ఎవడైనా అంటే
రెండు అమ్మలక్కల పోస్టులేద్దాం
పవర్ గాడికి జైకొట్టి సైన్యంలో కలిసి పోతారు...
 జై హిందువులవుతారు

5
Social media విప్లవం వర్ధిల్లునుగాక
Whatsapp చైతన్యం వర్ధిల్లును గాక
వాడి అమ్మలక్కలు మన మతములను, సంస్కృతులనూ  రక్షించునుగాక
తథాస్తూ, ఆమెన్, అమీన్, ఆమెనూ.......

6
rubik's cube రాజ్యాంగపు లెక్కల్లో
చిట్టి robot జ్ఞానపు terabyte enlightenment
కమ్యూనిస్టుకు దేవుడు లేకున్నా మతం ఉంటుంది
మనోభావపు గాయం ఉంటుంది 
జాగ్రత్తరా! అంటరానోడా !!
నీ కవిత్వం వాడే రాయాలి
నీ విప్లవం వాడే తేవాలి
నీకు చైతన్యం వాడే ఇవ్వాలి
నీ అభ్యుదయం వాడే మాట్లాడాలి
నువ్వొక జండా కర్రవై రంగురంగుల గుడ్డముక్కలని
రెపరెపలాడించాలి
అంతే...అంతే... నక్రాల్ జేస్తే నీ అమ్మలక్కల్ని
ఆన్లైన్ లో పండబెట్టించుకోవాలి...
So my dear కవీ!
ఈ దేశమున you have no rights to write 

Thursday 22 November 2018

         గెట్టింగ్_హోమ్" అనబడు సినిమా- కొన్ని కన్నీళ్ళూ

గత కొన్నేళ్ళుగా నన్ను వెంటాడుతున్న సినిమా ఇది. 2007 లో వచ్చిన చైనీస్ సినిమా. నేను చూసింది మాత్రం 2015 చివర్లలో. ఏమో ఎక్కడ పొరపాటు జరిగిందో గానీ మనకు చైనీస్ సినిమా అంటే బ్రూస్ లీ, జాకీచాన్ లాంటి ఫైటింగ్ సినిమాలో మరీ కాదంటే మార్షల్ ఆర్ట్ ప్రధానంగా సాగే వార్ జోన్ సినిమాలో తప్ప పెద్దగా భారతీయ భాషల్లోకి రాలేదు. ఇక హాలీవుడ్ మీదున్న మోజు చైనా సినిమాల లోలోతులకి మనలని వెళ్లనివ్వనూ లేదు. అట్లా చీనీ సినిమాలో ఉండే ఒక సున్నితమైన జోనర్ ని మనం చాలా ఆలస్యంగా చేరుకున్నాం...
ఒక చైనీస్ దర్షకుడున్నాడు. తని పేరు ఝాంగ్ యాంగ్. జెట్ లీ, డెవిడ్ చాంగ్ లాంటి ఫైటింగుల డైరెక్టర్ కాదతను. చైనాసినిమాలో మనకు తెలియని జోనర్ ఒకటుంది. "మార్నింగ్ సన్" "థండర్ ఇన్ ద ఈస్ట్" లాంటి సినిమాలకు చైర్మన్ మావో దర్శకత్వం వహించారని తెలిసిన వాళ్ళు చాలా తక్కువే అనుకోవాలి. అలా ఒక మానవీయ కోణాన్నీ దానిలోనే మనం ఎదుర్కుంటున్న, ఎదుర్కోబోతున్న సామ్రజ్యవాద ప్రమాదాన్నీ అంతర్లీనంగా చెప్పి వదిలేస్తాడు. 2013 లో వచ్చిన "స్ట్రే డాగ్స్" కావొచ్చూ, 2015 లో వచ్చిన "మౌంటెయిన్స్ మే డిపార్ట్" కావొచ్చూ ఝాంగ్ ప్రజెంట్ చేసే తీరు అత్యద్బుతం. ఇక మనం ప్రస్తుత సినిమాకి వస్తే. ఇదొక మామూలు నిర్మాణ విలువలున్న సినిమానే ఒక్కటంటే ఒక్క ఫైటింగ్ ఉండదు, కనీసం అందమైన చైనా హీరోయిన్ ఉండదు... కానీ ఒక్క సారి చూస్తే ఒక జీవిత కాలం పాటు వెంటాడే సినిమా ఇది.
సాధారణ వలస జీవితాల కథ ఇది. చెరోపల్లెనుంచీ బతుకుదెరువుకోసం నగరానికి చేరి మిత్రులయ్యారు జో, లీ. ఈద్దరికీ సాయంత్రం పూట సేదతీర్చేది ఒక చీప్ బార్. రోజంతా పని, సాయంత్రం ఆ అలుపు తీర్చుకోవటానికి, రెండు మాటలు చెప్పుకోవటానికీ కాస్త తక్కువ రకం మందూ. ఇలా సాగిపోతూంటుంది వాళ్ళ జీవితం.
అయితే లీ కి సొంత ఊళ్ళో ఒకకుటుంబం ఉంది. వాళ్ళకోసం ఇక్కడికి వచ్చి పని చేస్తున్నాడు కానీ జో ఒక ఒంటరి అతనికి ఎవరూ లేరు. అందుకే తన మరణం తర్వాత తన శవం అనాధగా కాకుండా తన సొంత ఊరిలోనే ఖననం చేయబడాలని జో కోరిక అదే మాటని తరచూ లీ కి చెప్తాడు. తన ఊరిలోనే తన అంత్యక్రియలు జరగాలని, జరిపించాలనీ లీదగ్గర మాట కూడా తీసుకుంటాడు. కానీ అనుకున్నది అనుకున్నట్టు జరిగితే జీవితం ఎలా అవుతుందీ. జో కన్నా ముందే లీ మరణిస్తాడు. వలస జీవితం లో ఉన్న ఎవడి కోరికైనా ఒకటే కదా. అందుకే స్నేహితుడి అంత్య క్రియలు అతని ఊరిలోనే జరిపించాలనుకుంటాడు జో. కానీ అతని దగ్గర ఉన్న డబ్బూ, అప్పటివరకూ లీ సంపాదించిన డబ్బూ మొత్తం కలిపినా ప్రత్యేక వాహనం లో శవాన్ని తీసుకు పోలేడు ఎలా?
జో ఒక పన్నాగం పన్నుతాడు లీ శరీరానికి మేకప్ వేసి కళ్ళకు సన్ గ్లాసెస్ పెట్టి బస్సెక్కుతాడు. కానీ దారి మధ్యలో దొంగలు బస్సును దోచుకునే సమయం లో నిజం బయట పడుతుంది. కానీ ఈ ఇద్దరి కథనీ విన్న దొంగలు అప్పటివరకూ బస్సులో దోచుకున్న డబ్బంతా జో చేతిలో పెట్టి లీ శరీరాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళమని చెప్పి వెళ్ళిపోతారు. అయితే బస్సులో ఉన్న ప్రయాణీకులు మాత్రం జో మీద పడి మొత్తం డబ్బు లాగేసుకుంటారు. పాపం వీళ్ళు దొంగలు కాదు కదా అందుకే వాళ్ళ డబ్బుతో పాటు జో దగ్గర ఉన్న ఉన్న డబ్బుని కూడా లాక్కొని అతన్నీ, లీ శరీరాన్నీ రోడ్డు మధ్యలో దింపేస్తారు. అక్కడినుంచీ మొదలవుతుందో అత్యద్బుత ప్రయాణం మరణించిన ప్రపంచం తో కలిసి జో చేసే ప్రయాణం.
ఫ్రెండ్ శరీరాన్ని భుజాల మీద మోసుకుంటూ ఒక టౌన్ కి చేరుకుంటాడు. తన దగ్గర మిగిలిన అతి తక్కువ డబ్బుల్లొంచి కొన్ని డబ్బులతో ఒక చిన్న హొటల్లో దిగితే తెల్లరే సరికి ఇతనిదగ్గరున్న కొన్ని డబ్బులని కూడా మాయం చేసి బయటికి గెంటేస్తారు హోటల్ వాళ్ళు. అక్కడినుంచీ మళ్ళీ లీని మోసుకుంటూ వెళ్తాడు, మధ్యలో ట్రాక్టర్లోనూ కొంత దూరం, ఒక పాత టైరులో కొంత దూరం శవాన్ని తరలిస్తాడు. ప్రతీ అడుగూ అతన్ని మనుషులకూ, నమ్మకాలకూ దూరంగా చేసేదే అయినా ఎక్కడా చుట్టూ ఉన్న మనుషులని నమ్మటం తగ్గినట్టు కనపడదు జో లో. ఆకలి బాధతో ఒక ఊరిని చేరుకుని అక్కడ జరిగే ఒక వృద్దుని అంత్య క్రియల్లో పాల్గొంటాడు. అయితే అవి నిజమైన ఫ్యునరల్స్ కాదు ఒక వేళ తాను చని పోయాక ఎవరూ సరిగా జరపరేమో అని తాను బతికుండగానే అంత్య క్రియలు జరిపించుకున్నానని బోజనాల సమయం లో చెప్తాడా వృద్దుడు. అతని అంత్యక్రియల్లో జో గుండెలు పగిలేలా ఏడ్చినందుకు మెచ్చుకుంటాడు కూడా. మళ్ళీ ఊరిచివరికి వచ్చి లీ శరీరం తో పాటు ప్రయాణం మొదలు పెడతాడు జో.
కానీ అంతకంతకూ లీ శరీరాన్ని మోయటం కష్టం అవుతూనే ఉంటుంది జోకి. ఒక సారి లీ బట్టల్లో కొన్ని డబ్బులు దొరుకుతాయి. వాటితో ఒక వాహనం మట్లాడి వెళ్ళిపోవాలనుకుంటాడు కానీ చివరికి అవీ దొంగ నోట్లు అని తెలుస్తుంది. తీవ్రమైన నిరాశతో ఇక లీ శవాన్ని పాతిపెట్టాలనుకొని గొయ్యి తవ్వి అలసిపోయి ఆ గొతిలోనే నిద్ర పోతాడు. ఆత్మహత్య చేసుకోవాలనీ చూస్తాడు కానీ లీ ని చూడగానే కర్తవ్యం గుర్తొస్తుంది. స్నేహితున్ని అలా అనాధగా వదలాలనిపించదు. మళ్ళీ భుజాలమీద వేసుకొని ప్రయాణం మొదలు పెడతాడు. అయితే ఈ సారి పోలీసులకు చిక్కుతాడు ఆ పాటికి లీ ఊరు కాస్త దగ్గరలోనే ఉన్నా దాదాపు కుళ్ళిపోయిన దశలో ఉన్న ఆ శవాన్ని పోలీసులు కాల్చేస్తారు. వీళ్ళ కథని విని వాళ్ళ హృదయం ద్రవించి పోతుంది. లీ "యాషెస్" ని జో చేతిలో పెట్టి ఆ ఊరిదగ్గర దింపుతారు. అయితే... అక్కడ అడుగు పెట్టగానే గుండె బద్దలయ్యే నిజం తెలుస్తుంది.
అక్కడ కొత్తగా కట్టబోయే ప్రాజెక్టు వల్ల ఆ ఊరిని ఖాళీ చేయిస్తోంది ప్రభుత్వం. లీ ఒక్కడే కాదు అతను పుట్టి పెరిగిన ఊరు చచ్చిపోయింది, అతని జన్మ భూమి మరణించింది. ఎక్కడైతే, ఏ తల్లి ఒడిలో అతను శాస్వత నిద్ర పోవాలనుకున్నాడో ఆ ఊరు ఇక ఉండదు... ఊళ్ళో ఉన్న ప్రజలతో పాటు లీ కుటుంబం కూడా వేరే చోటికి వెళ్ళిపోయింది. ఇంత దూరం చేసిన ప్రయాణానికి అర్థం ఏమిటో అర్థం కాని స్థితిలో. పాడుపడబోతున్న ఊరిలో లీ ఇంటి తలుపు మీద రాసి ఉన్న కొత్త అడ్రెస్ కి బయలుదేరటానికి సిద్దమవుతాడు జో. అక్కడితో "గెట్టింగ్ హోం" అనే అతి సాధారణ కథతో నడిచిన సినిమా ముగిసిపోతుంది. కానీ చూసిన ప్రేక్షకుడి భుజాల మీద లీ శరీరం బరువుగా అనిపిస్తుంది. జో క్యారెక్టర్ గుండెల్లో నడుస్తున్నట్టు ఉంటుంది....

Comments

Thursday 7 July 2016

వాంటెడ్-(కొంచం బాధ)


నీకీసంగత్తెల్సా...!
మనం కొన్ని సార్లు భాధనీ తీవ్రంగా ప్రేమిస్తామని.
సెమీకోలన్లకిందుగా అరబ్రాకెట్బోర్లించుకొని సాడ్ స్మైలీలా మొహాలను విషాదించుకొనీ అనంతానంత వికృతానందాల సైకోలుగా మనల్ని మనం చూసుకోవటాన్నీ ఇస్టపడతామనీ
తెల్సా...! నీక్తెల్సా??
లాంగెగో లాంగ్లాంగెగో... నిక్కర్లనుంచి ఆప్పుడప్పుడే మోకాళ్ళ కిందిబాగాన్నీ ఆచ్చాదించుక్న్న రోజుల్లో "ప్రేయసి రావే అనో ,"ప్రేమ ఎంతమథురం ప్రియురాలు అంత కఠినం...." అనో. అనగానే బాలూతో గొంతుకలిపి గుండెపగిలిన వేదనా లో కళ్ళు తుడుచుకుంటూ..... మనకసలు గాల్ఫ్రెండేలేదని గుర్తొచ్చినా......
కోరి..కోరి... అదె పాటని కాసెట్రివైండ్చేసి వింటూ.. కావాలని భాదపడ్డరోజులు గుర్తున్నాయాన్నయ్యా....
మైడియర్ మాసోకిస్టిక్...! ఎవ్వరూ లేరనుకునో అక్కర్లేదనుకునో కోరుకున్న ఏకాంతాల భుజాలపై చేతులేసి కాస్త సాడ్ఫేసేస్కొని ధీర్గంగా ఆలో చించుకుంటూ అస్తమించేసూర్యున్ని చూస్తున్నప్పుడు నిజం చెప్పూ ఇంటర్లో బైపీసీ సెకెండ్ బెంచ్ లావణ్య ఎందుగ్గుర్తొచ్చిందంటావ్!? లేదూ ఎప్పుడో ఒకసారి వెతికి వెతికి మరీ పాత పుస్తకాల్వెతికి మరీ ఈకలూడిన నెమలీఖని వెతికి పట్టుకొని ధీర్ఘంగా వేడి నిట్టూర్పంత భాద ఎందుకు పడ్డావంటావ్......
దేవదాసన్నయ్య చెప్పలేదూ..."మరపు రానీ భాదకన్నా మథురమే లేదోయ్....య్..య్... అనీ
భాదనెందుక్కోర్కుంటామో గానీ ఒక్క మాటిను నిన్నునువ్వు ఇంకొకర్తో ఫిక్షించుకున్నప్పుడో,మాస్టెర్బేట్గా సెక్షించుకున్నప్పుడో చంచల్ గూడా సత్ప్రవర్తన ఖైదీల్లా విడుదలయ్యే ఎండార్ఫిన్లు తనివితీరా ఏడ్చినప్పుడూ విడుదలౌతాయిష... అద్గదీ సంగతి... ఇందుగ్గాదూ.... సెక్స్ నీ కన్నీళ్ళనీ ప్యాకేజ్ లా ఇచ్చే పెళ్ళిని మన పెద్దోల్లు కనిపెట్టిందీ.....
ఇవన్నీ కాస్త పక్కకు జరిపితే.... చల్లగా మంచుకురిసే ఉదయాల్లో వేడివేడి చాయ్ చేతివేళ్ళకీ,పెదాలకీ కలిగించే భాదా.. ఏదో ఒక సాయంత్రం కాస్త ముద్దొచ్చి "ఆమెని" దగ్గరికి తీస్కుంటే "చి పొ" అంటూ భుజం పై గిల్లిన భాద,ఒక్కోసారి ఊరకనే అలా వంట గదిలోకెళ్ళి బర్నర్ ఉమ్మేసే ఆకుపచ్చని మంటపై కాస్త దూరంగా చేతినుంచి "ఉఫ్ఫ్"మంటూ తీసేసి "అదోరకమైన"బాదానందం ఇలా చాలా రకాలుగా మనం భాధల్ని కోర్కుంటామో తెల్సా... తెల్సా...తెల్సా...
ఔనూ...! నీ భార్య/భర్త కంటే ముందు నిన్ను కదిలించిన మనిషొకరిని కావాలని గుర్తు తెచ్చుకొని చూసే ఉంటావ్ కదా... కుంకుడు కాయ గింజని అరుగుమీద రుద్ది ముంజేతిపై పెట్టుకున్నట్టు తియ్యటి భాద కదా...!
పీ ఎస్: కోరి కోరి చేసుకునే పెళ్ళి చాలదూ.. (ఆడా/మగా) మనం భాదని ఎంత ప్రేమిస్తామో చెప్పటానికీ....

సున్ రహా హైనా తూ...రో రహా హూ మై


వాట్వాట్ నేనేడుస్తున్నానా!? నెవ్వర్ బ్రో..! మనం మగాళ్ళం.. ఏడవటం తప్పూ...ప్పుత్తూ...ఫ్ఫూ... ఖాష్... షోడా కల్పలే సాలే...! రాగొట్టిస్తున్నవ్....
సృస్ట్యాదినించిన్నీ ఏడ్వటమూ పగలబడి నవ్వటమూ ఆడదాని హక్కులుగా, వాటి ని కెలుక్కొని కొట్టుకు చావటమూ మగాడి లక్షణములు గా గ్రంథములేనాడో నిర్ణయించే యున్నవి...
ఐనా ఎందుకేడవాలి? అమ్మాయెళ్ళిపోయిందనా,ముప్పయేళ్ళోచ్చినా తనెళ్ళిపోయిందన్న వంకతో 
పంజెయ్యకుండా తిరుగుతూ అమ్మనిబ్బంది పెడ్తున్నందుకా..? బ్రో..! ఇట్సాలింద గేం డూడ్..!!
అసలేమైందో తెలుసా..? ఆ..! అనగనగా ఒకనాడు కళాశాల గవాక్షము గుండా ి అటచని కాంచె భూసురుని పిల్లని..
నాయనా నాయీబ్రామ్మణా...! అది బ్రాహ్మల పిల్లరా పడుద్దా...!? హెచ్చరించిన అంతరాత్మని తన్ని తగలేసి వెంటపడీ తనతో ఐలవ్యూ అనిపించుకొని..
అహో...! ఎన్ని దివారాత్రములెన్నివెన్నెలల్ ఎన్నిభాషలెన్నిబాసల్ జేసికొంటిమోకదా. ఏవితండ్రీ నాడు కురిసిన హిమక్రీముల్..!?
నాలుగేళ్ళు ప్రేమికులమై పార్కులందున సంచరించీ,ఇరానీ చాయ్ల సాక్షిగా సంచలించీ..
హ్మ్..! ఆ చిప్స్ పాకెట్టందుకో... ఒన్ ఫైన్ డే షి కేం టు మై ప్యారడైస్, అదే ఓల్డ్సిటీ కిషన్ భాగ్ తాన "మోహినీఫంక్షన్ హాల్" పక్క బిల్డింగ్ పైన పెంట్ హౌస్ లో...
కళ్ళలో నీళ్ళతో కాస్త కోపం తో "అయాం వెరీ సారీ హనీ,డాడ్ ఒప్పుకోవట్లేదు, ఐనా...! తప్పంతా నీదే...ఎన్నిసార్లు చెప్పాన్నీకు..
ఎంటెక్ తో ఎన్ని జాబ్స్ లేవు? ఈ సబెడిటర్జాబ్ లో ఏముంది? డబ్బులేకుండా ఎలా బతుకుతాం?
ఇదివరకెపుడూ అడగనన్ని ప్రశ్నలు ఒక్క సారే గుప్పించి.. చివరగా గొంతు తగ్గించి... హి ఈస్ చై.. అదే చైతన్య యౌ ఎస్ లో జాబ్ 2,00,000/- సాలెరీ అట. సారీ హనీ..!
చేతిలో సిద్దంగా పట్టుకున్న అశుభలేఖ. నా ముందు పడి తాను గదినుంచి బయట పడి....
వెల్లే ముందు "నీమీద నమ్మకం తో ఫొటోలూ గిఫ్టులూ అడగట్లేదు" అంటూ... నాలో ఉన్నాడో లేడో సాడిస్టిక్ అపరిచితున్ని చంపేసి....మెట్లుదిగే చప్పుడు వెంటేస్కొని వెళ్ళిపోయింది..
కొన్నిక్షణాలలాగే ఫ్లోర్ మీదరాలిన తన కన్నీటి చుక్కలనే చూస్తూ నేను..
అగ్ని పర్వతాలేం బద్దలవ్వలేదు పాపం కొన్ని సిగరెట్లాత్మహత్యించుకున్నాయ్...!
అలా వెళ్ళిపోయాక ఇవాళ ఎయిర్పోర్ట్ముందు.. సీ ఎం స్వదేశాగమన వార్తని కవర్ చేయటం కోసం వెల్తే....
తనే మళ్ళీ కనిపించి.. తను...తనంటే తనే... ఉమ.. నా ప్రాణం, ఒకప్పుడు నేనే ప్రాణం అన్న ఉమ, బీటెక్ సెకెండియర్ మెకానికల్ రెండు జళ్ళ ఉమ..
బాబ్డ్ హెయిర్ తో, చంకలో బాబుతో... నన్ను తాకిన చెయ్యితోనే "వాన్ని" తాకుతూ,నన్ను పిల్చినట్టే వాన్నీ పిలుస్తూ హనీ...!హనీ..!హనీ...!
షిట్..! ప్రపంచం ఇంత చిన్న గా ఏడవాలా? మళ్లీ తనెదుర్రానంత దూరం వెళ్ళిపోయుండాల్సింది కనీసం నేనైనా...
ఐనా బాసూ..! ప్రపంచం కాదనుకుంటా... జీవితం రా...! ఈ యొక్క పాడు జీవితముంది చూసావూ..! చాలా చిన్నది గురూ అందర్నీ.., జీవితం నుంచి వెళ్ళిపొయిన వాళ్ళని కూడా మర్చిపోదు.బ్లడీ బైగన్ కీ జిందగీ....
ఇదంతా చూస్తూ.... డబ్బు సంపాదించటం చేతకాని వెదవొకడు డొక్కు బైక్ని కసిగా కిక్కొట్టి గంటకి 100 కిలోమీటర్ల వేగం తో చలించి నీ ముందు పడి ఇలా మూడు "పావురమ్ము"లు ఎగరేసాడు అదన్నమాట సంగతి....
అంటే..! నేనేడవట్లేదు... కంట్లోకి సిగ..హ్..ర్ర్ర్.. హ్మ్మ్..! కంట్లోకి సిగరెట్పొగ వెళ్ళిందంతే.. ఔనూ...! పొద్దున అమ్మకి పంపమని డబ్బులిచ్చాను అక్కౌంట్లో వేసావా....!?